కల నిజం అయిన వేళ - # చివరి అధ్యాయం : వాగ్దానం



రోజులు గడుస్తుంటాయి.. సాయి మరియు శరణ్య మధ్య బంధం చాలా లోతుగా మారిపోతుంది.

ఒక సాయంత్రం చిన్నగా వర్షం పడుతోంది. రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గర ఇద్దరూ టీ తాగుతూ నిశ్శబ్దంగా నిలబడి ఉంటారు.

కానీ సాయి హృదయంలో మాత్రం ఒక తుఫాన్ నడుస్తోంది. ఇక తన భావాలను దాచుకోలేడు. 

చివరికి గాఢంగా ఊపిరి తీసుకుని..
“శరణ్య... నాకు మీరు నచ్చారు... కాదు...” అని చిన్నగా నవ్వుతూ “నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను...” అని అంటాడు.

ఆ క్షణంలో శరణ్య నిశ్శబ్దంగా మారిపోతుంది. సాయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది.

ఆమె సమాధానం కోసం టెన్షన్‌గా ఆమె వైపే చూస్తూ ఉంటాడు.
కొన్ని క్షణాల పూర్తి నిశ్శబ్దం. 
వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తుంది. తర్వాత శరణ్య మెల్లగా నవ్వుతుంది.

“నాకు ఓకే” అని మెల్లగా చెబుతుంది.

ఆ ఒక్క మాటతో సాయి కళ్లలో ఆనందం కనిపిస్తుంది.
కానీ... శరణ్య మళ్లీ సీరియస్‌గా చూస్తూ అంటుంది, “కానీ ఒక కండిషన్...”

సాయి జాగ్రత్తగా వింటాడు.

“ముందు మీ కలను నిజం చేసుకోండి... తర్వాత నా దగ్గరకు రండి... ఎన్ని రోజులు పట్టినా నేను వెయిట్ చేస్తాను... మన పెళ్లి కోసం నా ఫ్యామిలీని నేనే ఒప్పిస్తాను...” అని కాన్ఫిడెంట్‌గా చెబుతుంది.

సాయి ముఖంలో చిన్న బాధ కనిపిస్తుంది.

“అది ఎలా సాధ్యం శరణ్య? నేను జాబ్ వదిలేస్తే మా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి” అని నిస్సహాయంగా అంటాడు.

అప్పుడు శరణ్య తన చెయ్యిని సాయి చేతిపై పెట్టి అంటుంది,

“నేను మీకు సపోర్ట్ చేస్తాను... ముందు ఒక పార్ట్‌టైమ్ జాబ్ స్టార్ట్ చేయండి... ప్రొఫెషనల్‌గా ఫోటోగ్రఫీ నేర్చుకోవడం మొదలుపెట్టండి...” అని మోటివేట్ చేస్తుంది.

తర్వాత ఎగ్జైటెడ్‌గా అంటుంది, “నా కల కంటెంట్ క్రియేటర్ అవ్వడం... ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచం చాలా వేగంగా పెరుగుతోంది... మనము ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తే... మనం కూడా సక్సెస్ అవ్వగలం..."

ఆ మాటలు సాయి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్‌గా మారిపోతాయి. మొదటిసారి సాయి నిజంగా తన కలల కోసం ముందడుగు వేస్తాడు.

ఉదయం పార్ట్‌టైమ్ పని... రాత్రి ఫోటోగ్రఫీ ప్రాక్టీస్. నేర్చుకోవడం... ఫెయిల్యూర్స్... నిద్రలేని రాత్రులు... ఆ ప్రయాణం అంత ఈజీ కాదు.

మిడిల్ క్లాస్ ప్రెషర్... డబ్బు సమస్యలు... ఎక్విప్‌మెంట్ ఇష్యూస్... ఫ్యామిలీ డౌట్స్... ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి.

కానీ సాయి ఎప్పుడు బలహీనంగా ఫీల్ అయినా శరణ్య అతని పక్కనే నిలబడుతుంది.

అదే సమయంలో శరణ్య కూడా తన కంటెంట్ క్రియేషన్ జర్నీని మొదలుపెడుతుంది. మొదట్లో ఆమెకు వ్యూస్ రావు... జనాలు ట్రోల్ చేస్తారు... ఫ్యామిలీ ప్రెషర్ పెరుగుతుంది...

కానీ... ఈసారి సాయి ఆమెకు సపోర్ట్ సిస్టమ్‌గా మారుతాడు.
ఇద్దరూ ఒకరి కలల కోసం మరొకరు పోరాడుతారు.

ప్రేమను డిస్ట్రాక్షన్‌గా చూడకుండా... దాన్నే తమ బలంగా మార్చుకుంటారు.

రెండు సంవత్సరాల తర్వాత...

హైదరాబాద్ నగరం... ఒక స్టైలిష్ ఫోటోగ్రఫీ స్టూడియో బయట బోర్డ్ మీద ఇలా ఉంటుంది:

సాయి శరణ్య విజువల్స్ స్టూడియో

లోపల ప్రొఫెషనల్ కెమెరాలు...మూవీ ఆడిషన్ షూట్స్...అడ్వర్టైజ్‌మెంట్ ఫోటోగ్రఫీ... చాలా బిజీ వాతావరణం.
ఆ స్టూడియో యజమాని ఒకప్పుడు BPO ఎంప్లాయీగా పని చేసిన అదే సాయి. కానీ ఇప్పుడు అతను ఒక సక్సెస్‌ఫుల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్.

తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరోవైపు...

శరణ్య ఒక పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారుతుంది. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్... బ్రాండ్ కలాబరేషన్స్... క్రియేటివ్ కంటెంట్... తన నవ్వుతో... తన పాజిటివిటీతో... ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా మారుతుంది.

ఒక సాయంత్రం:

స్టూడియో టెర్రస్‌పై సన్‌సెట్ చూస్తూ ఇద్దరూ పక్కపక్కనే నిలబడుతారు.
సాయి నవ్వుతూ అంటాడు: “నేను మిమ్మల్ని మొదటిసారి బస్సులో చూసిన రోజు గుర్తుందా”

శరణ్య నవ్వుతూ అంటుంది: “నర్స్ మనిద్దరినీ భార్యాభర్తలు అనుకున్న రోజు గుర్తుందా”

ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు. ఎమోషనల్‌గా ఆకాశం వైపు చూస్తూ సాయి అంటాడు:
“నా జీవితంలో కలలు ఉండేవి… కానీ అవి నిజం అవుతాయని నేను ఎప్పుడూ నమ్మలేదు”
శరణ్య తన తలను సాయి భుజంపై ఆనించి అంటుంది:
“కానీ కలలు నిజం అవుతాయి సాయి…”

సాయి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్:

“మన కలలను మనం నమ్మితే.. అలాగే మనల్ని నమ్మే ఒక మనిషి మన పక్కన ఉంటే... అసాధ్యం కూడా సాధ్యమవుతుంది...”
 
“ఇదే... కల నిజం అయిన వేళ...

**ముగింపు**

దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.

Comments

Popular posts from this blog

Love Beyond Time...

Melody of Love...

కాలం కలిపిన ప్రేమ